2022కి భారీ లాభాలతో నిఫ్టి స్వాగతం
జనవరి డెరివేటివ్స్‌కు సూపర్ ప్రారంభం లభించింది. ఇవాళ ప్రారంభమైన కొత్త సెషన్లో నిఫ్టి 17400ని టచ్ కావడం విశేషం. ఓపెనింగ్‌లో 17238కి పడిన నిఫ్టి… అక్కడి నుంచి వెనక్కి తిరగలేదు. ప్రతి స్థాయిలోనూ మద్దతు కొనసాగింది. ఒమైక్రాన్ భయాలు తొలగుతుండటంతో నిఫ్టికి మద్దతు కొనసాగింది. ముఖ్యంగా ఉదయం హాంగ్‌సెంగ్ శుభారంగం మన మార్కెట్ల సెంటిమెంట్‌కు జోష్ లభించింది. యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నా, అమెరికా ఫ్యూచర్స్ డల్‌గా ఉన్నా… నిఫ్టి పట్టించుకోలేదు. బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్స్ నుంచి గట్టి మద్దతు లభించింది. అలాగే మెటల్స్ కూడా బలంగా ఉన్నాయి. ఇక మిడ్ క్యాప్ షేర్లలో ఇదే ట్రెండ్ కొనసాగింది. ఓపెనింగ్ నుంచి చివరిదాకా ఎక్కడా సూచీ తగ్గలేదు. ఐడియా దాదాపు పది శాతం పెరిగింది.