For Money

Business News

కుప్పకూలిన షేర్లు…

సింగపూర్ నిఫ్టికన్నా అధిక నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17000 పాయింట్ల దిగువకు చేరింది.16974ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16981 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 392 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా మూడు శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరిగినందున ఓఎన్‌జీసీ, డాలర్‌ బలం కారణంగా టీసీఎస్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ రెండు షేర్లు మినహా మిగిలిన నిఫ్టి షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నాలుగు శాతంపైగా నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలో అన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో అపోలో హాస్పిటల్‌ మినహా అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో ఉన్న 12 షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి మూడు శాతం దాకా నష్టంలో ఉందంటే… పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.