For Money

Business News

పెరిగితే అమ్మండి

ఫండమెంటల్స్‌ పరంగా నిఫ్టి చాలా బలహీనంగా ఉందని, పెరిగితే అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. ఇవాళ ఆయన సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌లో మాట్లాడుతూ… నిఫ్టి బలహీనంగా ఉందని అన్నారు. s2analytics.comకు చెందిన సుఖాని ప్రభుత్వ రంగ కంపెనీ కోల్‌ ఇండియాను రూ. 161 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. అలాగే JSPL షేర్‌ను రూ. 418 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని చెప్పారు. అలాగే అపోలో టైర్స్‌ను రూ. 226.5 స్టాప్‌లాస్‌తో, రూ. 2285 స్టాప్‌లాస్‌తో దీపక్‌ నైట్రేట్‌ను అమ్మాలని సిఫారసు చేశారు. earningwaves.comకు చెందిన మితేష్‌ ఠక్కర్‌ కూడా సీఎన్‌బీసీ టీవీ 18తో మాట్టలాడుతూ రూ. 2125 లక్ష్యం కోసం ఏబీబీ ఇండియా షేర్‌ను రూ. 2200 స్టాప్‌లాస్‌తో అమ్మమని సలహా ఇచ్చారు. మిడ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీ కోఫోర్జ్‌ను రూ. 4400 టార్గెట్‌తో రూ. 4,580 స్టాప్‌లాస్‌తో అమ్మాలని, అలాగే IRCTC షేర్‌ను రూ. 790 టార్గెట్‌ కోసం రూ. 836 స్టాప్‌లాస్‌తో అమ్మమని సలహా ఇచ్చారు.