17,650పైన ప్రారంభమైన నిఫ్టి
దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తరవాత బ్యాంక్ నిఫ్టి కూడా ఒక శాతం వరకు లాభంతో ప్రారంభమైంది. దీంతో సింగపూర్ నిఫ్టి కన్నా అధిక లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,675 స్థాయిని తాకిన నిఫ్టి 17,656 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 110 పాయింట్ల లాభంతో ఉంది నిఫ్టి. ఇక మిడ్ క్యాప్ సూచీ మళ్ళీ ఒకశాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో కేవలం ఒక్క టీసీఎస్ మాత్రమే నష్టాల్లో ఉంది. మిగిలిన 49 షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్ టాప్ గెయినర్ కావడం విశేషం. యూరో మార్కెట్ నిన్ననే భారీగా పెరిగినందున.. ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైతే… మన నిఫ్టి కాస్త చల్లబడే అవకాశముంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 317.05 2.24
టాటా స్టీల్ 1,333.00 2.08
హిందాల్కో 472.15 1.98
ఎస్‌బీఐ లైఫ్ 1,209.75 1.55
కోల్ ఇండియా 164.35 1.39
నిఫ్టి టాప్ లూజర్
టీసీఎస్ 3,851.35 -0.28