For Money

Business News

17,450పైన ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ తొలి ప్రతిఘటన స్థాయి వద్ద ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 17,479 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 80 పాయింట్ల లాభంతో 17,477 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 17,490ని దాటుతుందేమో చూడండి. ఆ ప్రాంతానికి వస్తే 17,515 స్టాప్‌లాస్‌తో అమ్మవచ్చని ఆల్గో ట్రేడింగ్‌ లెవల్‌ సూచిస్తోంది. అయితే 17,520ని దాటితే అమ్మొద్దు. యూరో మార్కెట్‌, అమెరికా ఫ్యూచర్స్‌ను గమనించండి. మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగనుంది. అలాగే బ్యాంక్‌ షేర్లలో కూడా. బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ అరశాతంపైగా లాభాల్లో ఉన్నా.. ఒత్తిడి రావడం ఖాయంగా కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా రెడ్‌లో జారుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,309.95 2.65
ఓఎన్‌జీసీ 130.65 1.67
ఐషర్‌ మోటార్స్‌ 2,848.75 1.27
టీసీఎస్‌ 3,868.95 1.19
అదానీ పోర్ట్స్‌ 757.20 1.11

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
నెస్లే ఇండియా 20,126.10 -0.97
బ్రిటానియా 4,064.00 -0.50
మారుతీ 6,930.55 -0.29 సిప్లా 935.85 -0.24
పవర్‌గ్రిడ్‌ 176.60 -0.23