17450పైన ఓపెనైన నిఫ్టి
నిఫ్టి ఇవాళ సింగపూర్ నిఫ్టి స్థాయిలో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టిని నిఫ్టి అందిపుచ్చుకుంది. 17387 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని సెకన్లలోనే 17,478ని తాకింది. నిఫ్టి ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 106 పాయింట్ల లాభంతో 17,459 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి, మిడ్ క్యాప్ నిఫ్టి కంటే అధిక లాభాల్లో ఉంది నిఫ్టి. ముఖ్యం ఆటో అమ్మకాల ప్రభావం ఆ రంగానికి చెందిన షేర్లపై స్పష్టంగా కన్పిస్తోంది. దాదాపు ప్రధాన కంపెనీల షేర్లన్నీ గ్రీన్లో ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ అత్యంత కీలక స్థాయి రూ.130 దిగువన రూ.126.30 వద్ద ట్రేడవుతోంది.