17,400పైన ప్రారంభమైన నిఫ్టి
మార్కెట్ ఓపెనింగ్‌లోనే ఇవాళ్టి తొలి ప్రతిఘటన స్థాయిని తాకింది. 17,420 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 17,425ని తాకిన తరవాత మళ్ళీ 17,400 దిగువకు వచ్చేసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్ల లాభంతో 17,394 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మెటల్ షేర్స్ మళ్ళీ వెలుగులో ఉన్నాయి. కొటక్ మహీంద్ర బ్యాంక్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టి 44 షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్, మిడ్ క్యాప్ … ఈ సూచీలన్నీ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి 17,430ని బ్రేక్ చేస్తుందా అన్నది చూడాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
బజాజ్ ఫైనాన్స్ 7,514.20 0.92
యూపీఎల్ 762.90 0.91
దివీస్ ల్యాబ్ 5,130.20 0.88
హెచ్డీఎఫ్సీ లైఫ్ 741.20 0.86
ఐషర్ మోటార్స్ 2,827.60 0.81
నిఫ్టి టాప్ లూజర్స్
గ్రాసిం 1,600.10 -0.39 హిందాల్కో 476.95 -0.29
ఇన్ఫోసిస్ 1,687.55 -0.26
అల్ట్రాటెక్ సిమెంట్ 7,926.10 -0.23
బజాజ్ ఆటో 3,692.35 -0.19