For Money

Business News

లాభాల్లో నిఫ్టి… నిలబడేనా?

నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17150ని దాటి 17155ని తాకింది. తరవాత 17129ని తాకిన తరవాత ఇపుడు 17135 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 47 షేర్లు లాభాల్లోఉన్నా నిఫ్టి లాభాలు అంతంత మాత్రేమ ఉన్నాయి. దీనికి కారణంగా చాలా వరకు షేర్లు నామ మాత్రపు లాభాల్లో ఉండటమే. నిఫ్టితో పాటు బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీలు కూడా కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి చూస్తుంటే నష్టాల్లోకి జారుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయి. నిఫ్టి హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టి మళ్ళీ 17,000ని తాకుతుందేమో చూడాలి.