16300పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికన్నా మెరుగ్గా 148 పాయింట్ల లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలో 16327 పాయింట్లను తాకిన నిఫ్టి 16300పైన స్థిరంగా ట్రేడవుతోంది. నిఫ్టిలో 43 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అన్ని సూచీలు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. దాదాపు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఐటీ కంపెనీల్లో మంచి మద్దతు లభిస్తోంది చాన్నాళ్ళు. అలాగే దివీస్ ల్యాబ్ కూడా ఒక శాతంపైగా లాభంతో ప్రారంభమైంది. నిన్న అయిదు శాతం నష్టపోయి.. అయిదు శాతం లాభంతో ముగిసిన అపోలో హాస్పిటల్ ఇవాళ మరో నాలుగుశాతం పెరిగి రూ. 3780 వద్ద ట్రేడవుతోంది. హిందాల్కో కూడా ఆకర్షణీయ లాభాలతో ఉంది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో కూడా చాన్నాళ్ళ తరవాత భారీ కొనుగోళ్ళు కన్పిస్తున్నాయి. మైండ్ ట్రీ 3 శాతం పెరిగింది. ఎంఫసిస్, ఎల్ అండ్ టీ టీఎస్ కూడా పెరిగాయి. జొమాటొకు క్రమంగా మద్దతు లభిస్తోంది.