For Money

Business News

1 నుంచి హాల్‌మార్క్‌ తప్పనిసరి

బంగారు ఆభరణాలకు జూన్‌ 1వ తేదీ నుంచి హాల్‌మార్క్‌ కచ్చితంగా ఉండాల్సిందే. బంగారం ప్యూరిటీని సూచించే హాల్‌మార్క్‌ తప్పనసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని అమలుకు సంబంధించి వ్యాపారస్థుల నుంచి అభ్యర్థనలు రావడంతో అమలును ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. అయితే జూన్‌ ఒకటవ తేదీ నుంచి క్యారెట్లను తెలుపుతూ హాల్‌మార్క్‌ ఉండాల్సింది. 14KT, 18KT, 20KT, 22KT, 23KT and 24KT అంటే ఆరు రకాల క్యారెట్ల బంగారానికి మాత్రమే హాల్‌మార్క్‌ తప్పనిసరి చేశారు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) తాజా ఆదేశాల మేరకు 21KT or 19KT వంటి క్యారెట్లను కూడా జూన్‌ 1వ తేదీ నుంచి పొందుపర్చాల్సి ఉంటుంది. అంటే ఇక నుంచి అన్ని రకాల ప్యూరిటీ ఉన్న బంగారానికి హాల్‌మార్క్‌ తప్పనిసరి. సో… 12KT లేదా 16KTలకు కూడా హాల్‌మార్క్‌ తప్పదు.