మళ్ళీ 17,700పైన నిఫ్టి
నిన్న గరిష్ఠ స్థాయిని ఇవాళ నిఫ్టి దాటుతుందేమో చూడాలి. ఇవాళ ఓపెనింగ్‌లోనే స్వల్ప నష్టాల ఒత్తిడిని ఎదుర్కొన్న నిఫ్టి వెంటనే దిగువస్థాయి నుంచి కోలుకుంది. 17597ని తాకిన నిఫ్టి కొద్దిసేపటి క్రితం 17712 పాయింట్లను తాకింది. ఇపుడు 17703 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం ఆసియా, ఇపుడు యూరో మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ అర శాతం వరకు లాభంతో ఉండటంతో నిఫ్టి కూడా పటిష్ఠంగా కన్పిస్తోంది. ఇవాళ నిఫ్టి దివీస్ ల్యాబ్ దెబ్బతీసింది. ఈ షేర్ ఫలితాల తరవాత ఏకంగా ఆరు శాతం క్షీణించింది. రూ. 3948 నుంచి రూ. 3700లకు పడిపోయింది. అంటే ఏకంగా రూ. 250 క్షీణించింది. అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా మూడు శాతం దాకా తగ్గింది. అయితే ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు నిఫ్టికి అండగా నిలిచాయి. నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి.