For Money

Business News

నిన్నటి లాభాలు గాయబ్‌….

స్టాక్‌ మార్కెట్‌లో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. నిన్నటి ర్యాలీ లాభాలన్నీ ఇవాళ పోయాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 226 పాయింట్ల నష్టంతో 15412 వద్ద ట్రేడవుతోంది. కొద్ది సేపటి క్రితం నిఫ్టి 15407ని తాకింది. యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రధాన సూచీలన్నీ రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. జులై నెలలో 0.75 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుతామని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ పావెల్‌ చెప్పడంతో మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముడిచమురు ధరలు తగ్గడంతో బీపీసీఎల్‌, హెచ్‌యూఎల్‌ వంటి షేర్లు తప్ప మిగిలిన అన్ని షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిన్న పెరిగిన మెటల్‌ షేర్లన్నీ ఇవాళ భారీ నష్టాలతో ఉన్నాయి. ఉన్నవాటిల్లో బ్యాంకు షేర్లే కాస్త తక్కువ నష్టంతో ఉన్నాయి. యూరప్‌ మార్కెట్‌ రెండు శాతంపైగా నష్టంతో ఉన్నందున… క్లోజింగ్‌లో నిఫ్టి 15400 స్థాయిని కాపాడుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. పుట్‌ రైటింగ్‌ పెద్దగా లేకపోవడంతో… నిఫ్టి పతకం ఎందాక అన్న అంశంపై మార్కెట్‌ ఓ అంచనాకు రాలేకపోయింది.