నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి ఊహించినట్లే లాభాల నుంచి నష్టాల్లోకి నాస్డాక్ జారుకుంది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీల లాభాలు కూడా తగ్గాయి. అంతకు ముందు యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. రాత్రి డాలర్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఏడాది గరిష్ఠ స్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో కూడా క్రూడ్ పటిష్ఠంగా ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్, హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా, మిగిలిన మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది.