For Money

Business News

అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ నేటి నుంచి

రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ పోర్టల్‌ అజియో.. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వరకు బిగ్‌ బోల్డ్‌ సేల్‌ ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా 2500కు పైగా బ్రాండ్స్‌కు చెందిన ఆరు లక్షల స్టైల్స్‌ 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉండనున్నాయి. అతి తక్కువ ధరలు, ప్రతి గంటకు ఫ్లాష్‌ డీల్స్‌, కచ్చితమైన బహుమతులు, రివార్డులు, పాయింట్లు వంటి ఆఫర్లను అందిస్తోంది. గ్యాస్‌, సూపర్‌ డ్రై, స్టీవ్‌ మ్యాడెన్‌, ఆర్మానీ ఎక్సేఛేంజ్‌, అడిడాస్‌, లివైస్‌, నైకీ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను వినియోగదారులు సరసమైన ధరలకు కొనుగోలు చేయొచ్చని అజియో పేర్కొంది.