For Money

Business News

DHFL‌.. పిరమల్‌ హస్తగతం

దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (DHFL‌) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు పిరమ ల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (పీఈఎల్‌) తెలిపింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా DHFL‌ రుణదాతలకు రూ.34,250 కోట్లు చెల్లించనున్నట్లు బుధవారం పేర్కొంది.
ఈ దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా DHFL‌రుణదాతలకు (ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులు సహా) మొత్తం రూ.38,000 కోట్లు రికవరీ కానుందని పిరమల్‌ తెలిపింది. అందులో రూ.34,250 కోట్లను పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) నగదు, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) రూపంలో చెల్లించనుండగా.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నగదు నిల్వల నుంచి మరో రూ.3,800 కోట్లు రికవరీ కానున్నాయి.