For Money

Business News

అదే లెవల్స్‌లో ట్రేడ్‌ చేయండి

మార్కెట్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. సింపూర్ నిఫ్టి 72 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి గనుక ఇదే స్థాయిలో ప్రారంభమైతే… ట్రేడర్లు నిన్నటి లెవల్స్‌ ఆధారంగా ట్రేడ్‌ చేయడం మంచిదని సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సూచిస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 18132. నిఫ్టి నిన్నటి గరిష్ఠ స్థాయి 18149, నిన్నటి కనిష్ఠ స్థాయి 17967. ఇవాల నిఫ్టి మధ్యలో ప్రారంభం అయ్యే అవకాశముంది. దీంతో ట్రేడర్లు నిఫ్టి18000 ప్రాంతంలో వచ్చే వరకు వెయిట్‌ చేయాలని అనూజ్‌ సలహా ఇచ్చారు. నిఫ్టి ఈ స్థాయికి వస్తే నిన్నటి కనిష్ఠస్థాయి 17967ని స్టాప్‌లాస్‌తో ఉంచుకుని 18000 ప్రాంతంలో కొనుగోలు చేయాలని అనూజ్‌ సలహా ఇస్తున్నారు. ఒకవేళ నిఫ్టి 17967 దిగువకు వెళితే బయటపడాలని ఆయన సూచించారు. 18000 ప్రాంతంలో నిఫ్టి గనుక నిఫ్టికి మద్దతు లభిస్తే నిఫ్టి సునాయాసంగా 18130ని తాకే అవకాశముంది. అంటే నిన్నటి క్లోజింగ్‌. నిఫ్టి ఆ స్థాయికి వస్తే లాభాలు స్వీకరించాలని సూచించారు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 18150 స్టాప్‌లాస్‌తో 18130 ప్రాంతంలో నిఫ్టిని అమ్మొచ్చని కూడా ఆయన సలహా ఇచ్చారు. సో.. పైస్థాయిలో 18150 స్టాప్‌లాస్‌, దిగువస్థాయిలో 17967 స్టాప్‌లాస్‌. వీటి మధ్య ట్రేడ్‌ చేయాలని అనూజ్‌ తెలిపారు. రేపు వీక్లీ, మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయాలని సూచించారు. 18000 వద్ద పుట్‌ రైటింగ్‌తోపాటు కాల్‌ రైటింగ్‌ జోరుగా ఉంది. నాస్‌డాక్‌ 52 వారాల కనిష్ఠ స్థాయికి 3 శాతం దూరంలో ఉంది. దీంతో ఐటీ షేర్లలో ఎలాంటి మద్దతు అందకపోవచ్చు. చైనా థీమ్‌తో ఇన్వెస్టర్లు లాభాలు ఆర్జించవచ్చని అనూజ్‌ తెలిపారు. ఆంక్షలు తొలగిస్తున్నందున చైనా మార్కెట్‌తో సంబంధం ఉన్న మెటల్స్‌, కమాడిటీ మార్కెట్‌లో మంచి లాభాలకు ఛాన్స్‌ ఉందని ఆయన అన్నారు.