NIFTY TRADE: దిగువ స్థాయిలో మద్దతు
సింగపూర్ ట్రెండ్‌ను గమనిస్తే నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయిలో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,879. దాదాపు 60 పాయింట్ల నష్టం అనుకున్నా… నిఫ్టి 15,820 ప్రాంతంలో ఓపెన్ కావాలి. నిఫ్టికి ఇది అత్యంత కీలక స్థాయి. ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ స్థాయిలో కొనుగోలు చేసేవారు కచ్చితంగా 15,800 స్టాప్‌లాస్‌గా ఉంచుకోవడం మంచిది. ఈ స్థాయికి దిగువకు వస్తే నిఫ్టి 15765, 15,750స్థాయిల వద్ద మద్దతు లభించవచ్చు. 15,820 ప్రాంతంలోకి నిఫ్టి వస్తే కాస్సేపు ఆగండి. ఆ తరవాతి స్థాయిలకు వస్తుందేమో చూడండి. వస్తే 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయండి. దిగువ స్థాయి నుంచి నిఫ్టి ఏమాత్రం పెరిగినా 15850 దాకా వెళ్ళే అవకాశముంది. నిఫ్టికి ఈ స్థాయికి చాలా కీలకం. ఈ స్థాయిని దాటితే 15,900ని దాటొచ్చని టెక్నికల్స్ చెబుతున్నాయి. కాని ఇవాళ ఆ స్థాయికి నిఫ్టి చేరుకోకపోవచ్చు. దిగువ స్థాయిలో కొన్నవారు స్వల్ప లాభంతో బయటపడటం మంచిది. నిన్న భారీగా లాభపడిన యూరో మార్కెట్లు ఇవాళ గనుక నష్టాల్లో ఉంటే నిఫ్టి 15,850ని దాటడం కష్టం. అనేక పెద్ద ఐపీఓలు మార్కెట్లో ఉన్నందున… నిఫ్టిలో భారీ పతనం అనుమానమే. షేర్లలో అమ్మకాలు జరిగినా… నిఫ్టిని ఆపరేటర్లు కాపాడే అవకాశాలు ఉన్నాయి.