For Money

Business News

NIFTY LEVELS: 16050 కీలకం

నిన్నటి మాదిరి ఇవాళ కూడా మార్కెట్‌కు ఇవాళ కూడా 16050 అత్యంత కీలకం. ఈ స్థాయి దిగువకు నిఫ్టి పడితే ఒత్తిడి పెరిగే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 16058 వద్ద ముగిసింది. ఈ స్థాయి దిగువకు వస్తే మాత్రం నిఫ్టి 15992 వద్ద మద్దతు అందే అవకాశముంది. లేకుంటే 15940దాకా వెళ్ళే అవకాశముంది. నిఫ్టి ఓవర్‌ బాట్‌ పొజిషన్‌లో ఉంది.. కాబట్టి నిఫ్టి పెరిగితే అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. మెటల్స్‌, ఆయిల్‌ షేర్లు భారీగా క్షీణిస్తున్నాయి. నిఫ్టి పడితే కొనుగోలు చేయమనే అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే ఇవాళ్టికి 15940ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవడం ముఖ్యం.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్

అప్‌ బ్రేకౌట్‌ 16176
రెండో ప్రతిఘటన 16145
తొలి ప్రతిఘటన 16125
నిఫ్టికి కీలకం 16102
తొలి మద్దతు 15992
రెండో మద్దతు 15972
డౌన్‌ బ్రేకౌట్‌ 15941