For Money

Business News

NIFTY TODAY: కాల్‌ రైటింగ్‌ జోరు

నిఫ్టికి అధికస్థాయిలో గట్టి ప్రతిఘటన ఎదురువుతోంది. 16,600పైన కాల్‌ రైటింగ్‌ పెరుగుతోంది. ఇక్కడి నుంచి 16,700 వరకు కాల్‌ రైటింగ్‌చాలా అధికంగా ఉందని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. ఒకవేళ నిఫ్టి 16,720 స్థాయిని దాటి పటిష్ఠంగా ట్రేడైతేనే వచ్చే వారం లాంగ్‌ పొజిషన్ డెరివేటివ్స్‌ తీసుకోవచ్చని… లేకుంటే నిఫ్టి నిలబడదని ఆయన అంటున్నారు. ఇదే సమయంలో దిగువ స్థాయిలో పుట్‌ రైటింగ్‌ కూడా జోరుగా ఉంది. ఎఫ్‌ఐఐలు ఇరువైపులా జోరుగా ఆప్షన్స్ రైటింగ్‌ చేస్తున్నందున… మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌లో ఉంటుందని వీరేందర్‌ అంటున్నారు. నిఫ్టి పెరిగితే వెంటనే 16,676 లేదా 16,709 ప్రాంతంలో ఒత్తిడి వస్తుందని ఆయన అంటున్నారు. అలాగే 16,762ను దాటితే 16,817ను తాకే అవకాశముంది. అదే నిఫ్టిలో ఒత్తిడి వస్తే 16,524 లేదా 16,468 ప్రాంతంలో మద్దతు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇంకా పెద్ద కరెక్షన్‌ వస్తే 16,410 లేదా 16,367కు నిఫ్టి పడే ప్రమాదముందని హెచ్చరించారు. చాలా రోజుల తరవాత విదేశీ ఇన్వెస్టర్ల స్థాయిలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు లేవు. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల డేటా కోసం వీడియో చూడండి.