For Money

Business News

పెరిగితే అమ్మండి

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లలో ఒకరకమైన ఆందోళన నెలకొంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు కూడా మార్కెట్‌పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల డేటా చూశాక… విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్ముతున్నారని, ఆ స్థాయిలో దేశీయ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు అందడం లేదని అంటున్నారు. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ… నిఫ్టితోపాటు బ్యాంక్‌నిఫ్టి కూడా బలహీనంగా ఉన్నాయని అన్నారు. ఇవి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని అంటున్నారు. ఇన్వెస్టర్లు డెరివేటివ్‌ మార్కెట్‌లో నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి పుట్స్‌ కొనడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి మార్కెట్‌ మూడ్‌ మారిపోయిందని ఇతర అనలిస్టులు అంటున్నారు. ఎంపిక చేసిన కొన్ని షేర్లు పెరిగే అవకాశమున్నా… మార్కెట్‌ పతనంవైపు పయనిస్తోందని హెచ్చరిస్తున్నారు.(ఆప్షన్స్‌లో ట్రేడ్‌ చేసే ఇన్వెస్టర్లు కచ్చితంగా హెడ్జ్‌తో చేయండి. ఖాతాలో నిఫ్టి, షేర్లు లేదా ఫ్యూచర్స్‌ లేకుండా ఆప్షన్స్‌ ట్రేడింగ్ చేయడం ప్రమాదకరం. ఒక్కోసారి పెట్టుబడి మొత్తం పోయే ప్రమాదముంది)