For Money

Business News

NIFTY TRADE: 18,570 కీలకం

నిఫ్టి ఇవాళ 15600 ప్రాంతంలో ప్రారంభమైనా… 18570 ప్రాంతంలో నిలబడుతుందా అనేది చూడండి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయికి చేరొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 18,477. నిఫ్టి దాదాపు 80 లేదా వంద పాయింట్ల లాభంతో ప్రారంభం కావొచ్చు. సో నిఫ్టికి తొలి ప్రతిఘటన 18570 లేదా 18600 ప్రాంతంలో ఎదురు కావొచ్చు. నిఫ్టి ఇదే స్థాయిలో ప్రారంభమైతే 15 లేదా 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. హాంగ్‌సెంగ్‌, జపాన్‌ సూచీలు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మరి నిఫ్టి కూడా ఈ స్థాయి లాభాలు వస్తాయా అన్నది అనుమానమే. నిఫ్టిని పై స్థాయిలో అమ్మినా స్వల్ప లాభాతో బయటపడండి. నిఫ్టి 18,550 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. అక్కడి నుంచి పడితే 18440 వరకు మద్దతు లేదు. మరి ఈ స్థాయికి పడుతుందా అన్నది చూడండి. కొనుగోలు మద్దతు మాత్రం 18400 వద్ద మాత్రమే ఉంది.