NIFTY TODAY: నేడూ అమ్మకాల ఒత్తిడి
సింగపూర్ నిఫ్టి 160 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అయితే నిఫ్టితో పోలిస్తే అధిక ప్రీమియంతో సింగపూర్ నిఫ్టి ట్రేడవుతోంది. మరి ఈ గ్యాప్ ఇవాళ ఎంత వరకు తగ్గుతుందో చూడాలి. ఎందుకంటే నిఫ్టి క్రితం ముగింపు 17,368. సింగపూర్ నిఫ్టి స్థాయిలో నష్టాలు రావాలంటే నిఫ్టి 17200 ప్రాంతంలో ప్రారంభం కావాలి. కాని నిఫ్టి 17300 ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టికి 17,273 స్థాయిలో మద్దతు లభించవచ్చు. నిఫ్టి గనుక ఓపెనింగ్ నుంచి పెరిగినా అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించే పక్షంలో 17,240 స్టాప్‌లాస్ పెట్టుకోండి. మిడ్ సెషన్ తరవాత నిఫ్టి దిశపై క్లారిటీ వచ్చే అవకాశముంది. నిఫ్టికి దిగువ లెవల్స్… 17240, 17200. ఈ స్థాయికి దిగువన 17,070 వరకు మద్దతు లేదు. నిఫ్టికి మద్దతు లభించినా.. 17,455 దాటితే కాని నిఫ్టి నిలబడటం కష్టం.