For Money

Business News

NIFTY TRADE: తొలి ప్రతిఘటన వద్ద ప్రారంభం

ప్రపంచ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. లాభనష్టాల్లో పెద్ద మార్పు లేకుండా నామ మాత్ర మార్పులతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,132. నిఫ్టి లాభాల్లో ప్రారంభమైన పక్షంలో తొలి ప్రతిఘటన 17,190 ప్రాంతంలో ఎదురు కావొచ్చు. నిఫ్టి ఓవర్‌బాట్‌ స్థితిలో ఉన్నందున నిఫ్టిలో ఒత్తిడి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పై స్థాయిలో కొనుగోలు చేయడం కన్నా… స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో అమ్మడమే బెటర్‌. లేదంటే ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే బెటర్‌. నిఫ్టి కీలక స్థాయి 17200. ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందవచ్చే. పై స్థాయిలో అమ్మేవారు ఈ స్థాయిని గమనించండి. ఇక్కడ నిఫ్టి బలహీనంగా ఉంటే వెయిట్‌ చేయండి. లేదంటే లాభాలు స్వీకరించండి. 17200 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభించని పక్షంలో వెంటనే 16,940 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు.ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టికి 16,860 వరకు మద్దతు లేదు. టెక్నికల్స్‌ చూస్తుంటే… ఒక గ్యాప్‌కు మరో గ్యాప్‌కు మధ్య చాలా తేడా ఉంది. కాబట్టి అంచనాలు తారుమారైతే భారీ నష్టాలు తప్పవు. ఎందుకంటే అధిక స్థాయిలో నిఫ్టిలో ట్రే్డ్‌ చేయాలంటే పెట్టుబడి కూడా ఎక్కువ. కాబట్టి తక్కువ పెట్టుబడి ఉన్న చిన్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే బెటర్‌.