NIFTY TRADE: 18,300పైన ఒత్తిడి
ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. చైనా మార్కెట్లు మాత్రం అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. అమెరికా నాస్‌డాక్, జపాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు డల్‌గా ఉన్నాయి. మనదేశంలో కూడా వెలువడుతున్న కార్పొరేట్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా స్పెషాలిటీ కెమికల్స్ రంగలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికి వస్తే… నిఫ్టి క్రితం ముగింపు18,266. సింగపూర్ నిఫ్టి దారిలో నిఫ్టి పయనిస్తే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18300ని దాటే అవకాశముంది. ఇవాళ్టికి నిఫ్టికి 18,310 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయిని దాటితే 18,350 వద్ద నిఫ్టి తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. ఈ స్థాయికి వచ్చినా లేదా దాటినా 20 పాయింట్లు స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. ఒక వేళ నిఫ్టిలో ఒత్తిడి పక్షంలో 18,300 దిగువన నిఫ్టి బలహీనంగా ఉంటుంది. వెంటనే క్రితం ముగింపు స్థాయికి అంటే 18260 ప్రాంతానికి చేరొచ్చు. కాని నిఫ్టి బయ్ సంకేతాలు మాత్రం18200 దిగువన ఉన్నాయి. నిఫ్టి 18,180 18,200 ప్రాంతంలో నిఫ్టి స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు ఉన్నందున నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చు.