For Money

Business News

కొసరు లాభాలతో ముగింపు

ఉదయం ఆకర్షణీయ లాభాలతో ఆరంభమైన నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చింది. 17,685 స్థాయిని తాకిన నిఫ్టి ఒక దశలో లాభాలన్నీ కోల్పోయింది. 17,519 పాయింట్లను తాకిన తరవాత 36 పాయింట్ల లాభంతో 17558 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌ అతి కష్టంగా లాభాల్లో క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు అర శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టిలో 34 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టిలో గ్రాసిం, ఎన్టీపీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచాయి. ఐషర్‌ మోటార్స్‌ టాప్‌ లూజర్‌గా ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 2.7 శాతం పెరగ్గా, బంధన్‌ బ్యాంక్‌ 4 శాతం నష్టంతో ముగిసింది. బ్యాంకు నిఫ్టిలో కొటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ షేర్లు టాప్‌ గెయినర్‌గా నిలిచాయి. ఇక ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ కూడా 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌లో ముగిసింది. ఇవాళ రూ. 20.35 పెరిగి రూ. 427.95 వద్ద క్లోజైంది.