For Money

Business News

నిఫ్టి: డే ట్రేడర్స్‌కు కాసుల పంట

నిఫ్టి ఇవాళ్టి కదలికల వల్ల పొజిషనల్‌ ట్రేడర్స్‌కు ఎలాంటి లాభనష్టాలు లేకున్నా… డే ట్రేడర్స్‌కు కాసుల పంట పండించింది. ఉదయం 15,767 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి కేవలం గంటన్నరలో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,513ని తాకింది. ఏకంగా 250 పాయింట్ల పతనంతో షార్ట్‌ సెల్లర్స్‌కు కాసుల పంట పండింది. 15,550 నిఫ్టికి గట్టి మద్దతు స్థాయి కావడంతో … ఇక్కడ కొనుగోలు చేసినవారికి మళ్ళీ భారీ లాభాలు దక్కాయి. నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత కోలుకుని 15, 715 పాయింట్లను తాకింది. మళ్ళీ భారీ లాభాలు పొందారు డే ట్రేడర్స్‌. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 37 పాయింట్ల నష్టంతో 15709 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే బ్యాంక్‌ నిఫ్టి ఇంకా అర శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇవాళ కూడా రెండున్నర శాతం నష్టపోవడం విశేషం.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
భారతీ ఎయిర్‌టెల్‌ 567.80 5.04
టాటా స్టీల్‌ 1,368.05 2.81
ఎస్‌బీఐ లైఫ్‌ 1,129.00 2.16
దివీస్‌ ల్యాబ్‌ 4,889.80 2.05
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 993.00 1.76

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కొటక్‌ బ్యాంక్‌ 1,654.00 -2.59
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 4,720.00 -2.55
టాటా మోటార్స్‌ 285.00 -2.20
ఎం అండ్‌ ఎం 729.95 -2.09
సిప్లా 894.00 -2.09