కోలుకున్నా… భారీ నష్టాలు
వీక్లీ డెరివేటివ్స్ కారణంగా నిఫ్టి చివర్లో ఓ వంద పాయింట్లు కోలుకున్నా భారీ నష్టాలు తప్ప లేదు. ఒకదశలో నిఫ్టి 17,648 పాయింట్లకు క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని 17757 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 181 పాయింట్లు నష్టపోయింది. ఉదయం గరిష్ఠ స్థాయితో నిఫ్టి 300 పాయింట్లు కోల్పోవడంతో… ఇన్వెస్టర్లు కంగారు పడ్డారు. ఎందుకంటే ఆసియా, యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా మన మార్కెట్లలో ఈ స్థాయి ఒత్తిడి రావడం. కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, బడ్జెట్‌పై ఏ రంగానికి పెద్ద ఆశలు లేకపోవడంతో… బడ్జెట్ ముందు ఒత్తిడి కన్పిస్తోంది. బజాజ్ ఫిన్ సర్వ్ నాలుగున్నర శాతం నష్టపోయింది. నిఫ్టి ఒక్కటే ఒక శాతం నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌లో అస్సలు తగ్గలేదు. మిడ్ క్యాప్ నిఫ్టి కూడా కేవలం 0.3 శాతం నష్టపోయింది. అయితే బ్యాంక్, ఆర్థిక సంస్థల నిఫ్టి మాత్రం అర శాతంపైనే ముగిశాయి. క్యాష్ మార్కెట్లో అమ్ముతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌లో భారీ ఎత్తున ట్రేడింగ్ చేస్తున్నారు.