For Money

Business News

HUL: అంచనాలను మించిన పనితీరు

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ (HUL) పనితీరు మార్కెట్‌ అంచనాలకు మించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 16.76 శాతం పెరిగి రూ. 1,921 కోట్ల నుంచి రూ. 2,243 కోట్లకు చేరింది. అలాగే ఇతర ఆదాయంతో సహా కంపెనీ టర్నోవర్‌ కూడా 10.23 శాతం పెరిగి రూ. 11,959 కోట్ల నుంచి రూ. 13,183 కోట్లకు చేరింది. కంపెనీ అమ్మకాలు రూ. 12,900 కోట్లు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని, ప్రభుత్వం మనరేగా పథకానికి నిధుల కేటాయింపు పెంచాల్సిన అవసరం ఉందని హెచ్‌యూఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహతా అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కంపెనీ ఆదాయం తగ్గుతోందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి గత ఏడాది త్రైమాసికంలో వృద్ధి రేటు 4 శాతం ఉండగా, ఈ ఏడాది 2 శాతానికి తగ్గిందన్నారు.