For Money

Business News

నిరాశపర్చిన ఏషియన్‌ పెయింట్స్‌

పెయింట్స్‌ రంగంలో రారాజుగా ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ పనితీరు మూడో త్రైమాసికంలో అంచనాలను తప్పింది. గత ఏడాదితో పోలిస్తే భారీగా నిరాశపర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 8,527 కోట్ల టర్నోవర్‌పై రూ. 1031 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రెవన్యూ పరంగా పెద్ద మార్పు లేనకున్నా..నికర లాభం విషయంలో మార్కెట్‌ అంచనాలను కంపెనీ తప్పింది. అలాగే మార్జిన్స్‌ కూడా 18 శాతానికి పరిమితం కావడం మార్కెట్‌ ఊహించనది. అనూహ్యంగా ముడి పదార్థాల ధరలు పెరగడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. కంపెనీ షేర్‌ ప్రస్తుతానికి ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది.