మిడ్ సెషన్లో ఒత్తిడి
ఆరంభంలో 17685 పాయింట్లను తాకిన నిఫ్టి.. అక్కడి నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. అధిక స్థాయి వద్ద స్వల్ప లాభాల స్వీకరణ జరిగినా… నిఫ్టి ఇంకా లాభాల్లోనే ఉంది. నిఫ్టి ప్రస్తుతం 17573 పాయింట్ల వద్ద 51 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి బ్యాంక్‌పై కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీలు మాత్రం అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో ఉన్నాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్ ఉదయం లాభాల్లో ఉండగా, ఇపుడు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లన్నీ జాక్సన్ హోల్ సింపోజియంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాయి. అదానీ గ్రూప్ షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. ఎన్డీటీవీ షేర్ ఇవాళ కూడా 5 శాతం అప్పర్‌సర్క్యూట్‌లో ఉంది. ఉదయం ఒక మోస్తరు ట్రేడింగ్ సాగింది. ఒకదశలో షేర్ రూ.397ని తాకినా… భారీ కొనుగోళ్ళు జరగడంతో మళ్ళీ రూ. 427.95ని తాకింది. ఈ ధర వద్ద ఎన్ఎస్ఈలో 1.84 లక్షల షేర్లకు కొనుగోలు ఆర్డర్లు ఉన్నాయి. అమ్మకందారులు లేరు.