For Money

Business News

17650పైన ప్రారంభం

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17667ని తాకిన నిఫ్టి ఇపుడు 17661 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 138 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 444 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఒక శాతంపైగా లాభపడింది. ఎం అండ్‌ ఎంలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. రెండున్నర శాతం లాభంతో ఈ షేర్‌ నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌లో ఉంది. నిఫ్టిలో ఏకంగా 47 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో సెయిల్‌, అదానీ గ్రీన్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో అస్ట్రాల్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. బ్యాంక్‌ షేర్లలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 1.74 శాతం లాభంతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో మార్కెట్‌లో కరెక్షన్‌ అనుమానమే. మరి నిఫ్టి 17700ని తాకుతుందేమో చూడాలి.