నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి
ఉదయం 18250ని దాటిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే బలహీనపడటం ప్రారంభమైంది. క్రమంగా లాభాలను కోల్పోయి 11 గంటలకల్లా క్రితం ముగింపు స్థాయికి చేరింది. యూరో ఫ్యూచర్స్ బలహీనంగా ఉండటంతో… నిఫ్టి అదేస్థాయిలో మిడ్ సెషన్ వరకు కొనసాగింది. మిడ్ సెషన్ తరవాత నిఫ్టి 42 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి నుంచి 175 పాయింట్లు క్షీణించింది. నిఫ్టిలో 30 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అద్భుత ఫలితాలు ప్రకటించిన బ్రిటానియా షేర్ ఒకదశలో పది శాతం తాకినా.. ఇపుడు 8.58 శాతం వద్ద ట్రేడవుతోంది. అలాగే ఎస్బీఐ షేర్ కూడా 3 శాతంపైగా లాభపడింది. ఇవాళ దివీస్ ల్యాబ్ ఫలితాలు రానున్నాయి. ఈలోగా షేర్ ఏకంగా ఏడు శాతంపైగా నష్టపోయింది.