For Money

Business News

18250ని తాకిన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికన్నా అధికలాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18255ని తాకిన నిఫ్టి ఇపుడు 18224 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపు పోలిస్తే 107 పాయిట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫలితాలతో నిఫ్టి బ్యాంక్‌ భారీ లాభాలతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ ఇపుడు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఫలితాలు బ్రహ్మాండంగా ఉండటంతో బ్రిటానియా 6.6 శాతం, ఎస్‌బీఐ 4.34 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10 శాతం లాభంతో ట్రేడవుతోంది. కెనరా బ్యాంక్‌ ఇవాళ 4 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇతర షేర్లలో నైకా, జొమాటొ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, సీమన్స్‌ షేర్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. గురునానక్‌ జయంతి సందర్భంగా మార్కెట్‌కు రేపు సెలవు