MID SESSION: లాభాల నుంచి నష్టాల్లోకి…
రెండో ప్రధాన నిరోధక స్థాయి వద్ద నిఫ్టి నిలబడలేకపోయింది. ఉదయం 17,884 పాయింట్లను తాకిన నిఫ్టి అక్కడి నుంచి మిడ్ సెషన్ వరకు కాస్త ఆటు పోట్లకు లోనైనా… 12.30 గంటల తరవాత బలహీనపడింది. సరిగ్గా 1 గంటలకు నష్టాల్లోకి జారకున్న నిఫ్టి 17,715 పాయింట్లను తాకింది. అంటే 170 పాయింట్లు పడిందన్నమాట. డే సెల్లర్స్‌కు మంచి లాభాలు వచ్చాయి ఇవాళ. నిఫ్టి కేవలం 0.4 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ సూచీ 0.84 శాతం పడింది. నిఫ్టి నెక్ట్స్ కూడా అర శాతం పైగానే నష్టపోయింది. బ్యాంకు నిఫ్టి ఇంకా గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి పతనం తగ్గిందనాలి. మరి ఇక్కడి నుంచి నిఫ్టి కోలుకుంటుందేమో చూడాలి.