For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనొచ్చా

నిఫ్టిని 19886పైన ఉన్నంత వరకు షార్ట్‌ చేయొద్దని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి గనుక ఈ స్థాయిని కాపాడుకుంటే పెరిగే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. నిఫ్టికి 16816 వద్ద చాలా పటిష్ఠమైన మద్దతు ఉందని. కాబట్టి దీన్ని స్టాప్‌లాస్‌తో ఉంచుకుని కొనుగోలు చేయొచ్చని స్టాక్‌ మార్కెట్‌ డేటా అనలిస్ట్‌ వీరేందర్ కుమార్‌ అంటున్నారు. 16793 దిగువకు వెళితే మాత్రం నిఫ్టిపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. సింపుల్‌గా చెప్పాలంటే 16800-830 మధ్య కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్‌ 16790గా పెట్టుకోవచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే నిఫ్టి 16906ని దాటితే మాత్రం 17000 స్థాయికి చేరుకోవడం సులభమేనని అంటున్నారు. ప్రథమార్థంలో దిగువ స్థాయిలో కొనేవారు యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందే బయటపడే ఛాన్స్‌ వస్తుందని అంటున్నారు. ఒక మోస్తరు లాభాలతో బయటపడటం మంచిదని అంటున్నారు. రిస్క్‌ తీసుకునే వారు ఎప్పటికపుడు స్టాప్‌ లాస్‌ మార్చుకుంటూ లాభాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
దిగువ స్థాయలో 16886, 16816తో పాటు 16793ని గమనించండి. అలాగే పెరిగినపుడు 16930, 16981 లేదా 17010ని గమనించి లాభాలు స్వీకరించాలని సూచిస్తున్నారు. 17010పైన నిఫ్టి పెరిగే అవకాశముంటే.. ఇదే స్థాయిని స్టాప్‌లాస్‌తో పెట్టుకుని లాంగ్‌ పొజిషన్‌ కొనసాగించచ్చు. కాని హెచ్చుతగ్గులు అధికంగా ఉన్న సమయంలో స్వల్ప లాభాలతో బయటపడటం మంచిది.

(watch video down below in the website www.formoney.in)