For Money

Business News

NIFTY LEVELS: పడితే ఆగండి..

సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 67 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,577. కాబట్టి నిఫ్టి 17500 ప్రాంతంలో ప్రారంభం అవుతుందేమో చూడాలి. ఒకవేళ ప్రారంభమైనా నిఫ్టి మరింత పడేందుకు వరకు ఆగాలని అంటున్నారు అనలిస్టులు. నిన్న నిఫ్టి 17345ని తాకిన విషయం తెలిసిందే. ఇవాళ్టి కూడా ఇది డౌన్‌బ్రేకౌట్‌ స్థాయి. అయితే 17446 ప్రాంతంలో తొలి మద్దతు ఉండగా, రెండో మద్దతు 17400 ప్రాంతంలో ఉంది. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్‌ ఉన్నందున నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించవచ్చు.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17824
రెండో నిరోధం – 17755
తొలి నిరోధం – 17710
నిఫ్టికి కీలకం – 17560
తొలి మద్దతు – 17446
రెండో మద్దతు – 17400
డౌన్‌ బ్రేకౌట్‌ – 17331