For Money

Business News

నిఫ్టి.. అంతా ఫ్యూచర్స్ మాయ

ఇవాళ ట్రేడింగ్‌ మొత్తం అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా డ్యాన్స్‌ చేయడమే. లోకల్‌గా ఎలాంటి అంశాలు లేకపోవడంతో… నిఫ్టి పూర్తిగా అమెరికా ఫ్యూచర్స్ ప్రకారం హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం భారీ నష్టాలతో 17070ని తాకింది. అయితే యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు అమెరికా ఫ్యూచర్స్‌ భారీగా పెరిగాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్ ఏకంగా 300 పాయింట్లు పెరిగింది. అలాగే యూరో స్టాక్స్‌ 50 సూచీ కూడా. దీంతో మన నిఫ్టి కూడా దిగువ స్థాయి నుంచి 280 సాచింట్ల వరకు కోలుకుంది. కాని యూరో మార్కెట్లు ప్రారంభమై… ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ యూరోతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ లాభాలన్నీ పోయాయి. నాస్‌డాక్‌, డౌ జోన్స్‌ ఫ్యూచర్స్‌ దాదాపు నష్టాల్లోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దీంతో మన నిఫ్టి కూడా 17200 దిగువకు పడింది. క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 17206 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్లు క్షీణించింది. ఇవాళ నిఫ్టికి కాస్త ఐటీ షేర్లను నుంచి మద్దతు లభించింది. నిఫ్టి తరవాతి సూచి నిఫ్టి నెక్ట్స్‌ 1.3 శాతం నష్ట పోగా, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 0.9 శాతం నష్టపోయింది. బ్యాంక్‌ నిఫ్టి నామమాత్రపు లాభంతో ముగిసింది.