For Money

Business News

జీఎస్టీ పరిధిలోకి విమానాల పెట్రోల్‌

విమానాలు నడిపేందుకు వాడే పెట్రోల్‌ను ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) అంటారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ను డీజిల్‌ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఏటీఎఫ్‌పై 18 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి రాష్ట్రాలు అదనంగా వ్యాట్ విధించుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన వ్యాట్ విధించాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా అమలు చేస్తున్న ఫార్ములానే తామూ తెస్తామని కేంద్రం అంటోంది. ప్రస్తుతం దేశంలో ఎన్నడూ లేనివిదంగా ఏటీఎఫ్‌ ధరలు ఉన్నాయి. యూపీఏ హయాంలో అంటే 2008 ఆగస్టులో బ్యారల్‌ క్రూడ్‌ ధర 147 డాలర్లు ఉండగా, ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ అంటే 1000 లీటర్ల ధర రూ. 71,028 ఉండేది.ఇపుడు మనదేశంలో అత్యధికంగా ఢిల్లీలో రూ. 90,519లకు విక్రయిస్తున్నారు. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు ధర. ఇక దీనిపై జీఎస్టీ, వ్యాట్ వేస్తే… ఎంత అవుతుందో మరి?