దుమ్ము రేపుతున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో చాలా గట్టి రిలీఫ్ ర్యాలీ వచ్చింది. అమెరికా, ఆసియా ఇపుడు యూరప్.. అన్ని మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 16506 పాయింట్లను తాకిన నిఫ్టి కాస్సేపటి క్రితం 16695 పాయింట్లను తాకింది. అంటే క్రితం ముగింపుతో పోలిస్తే 340 పాయింట్లు లాభపడిందన్నమా. నిఫ్టి ప్రస్తుతం 16553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్ చిత్రంగా ఇవాళ 0.75 శాతం లాభాలకే పరిమితం కాగా, ఇతర ప్రధాన సూచీలు రెండు శాతం లాభంతో ఉన్నాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ షేర్లలో గట్టి షార్ట్ కవరింగ్ కన్పిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్ కాగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. దాదాపు అన్ని ప్రధాన టెక్ కౌంటర్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టిలో 43 షేర్లు లాభాల్లో ఉన్నాయి. యూరో మార్కెట్లు ఒక శాతం లాభాల్లో ఉండగా, అమెరికా ఫ్యూచర్స్ కూడా అదే స్థాయి లాభాల్లో ఉన్నాయి. మరి నిఫ్టిలో లాభాల స్వీకరణకు ఛాన్స్ ఉందా.. లేదా 17000 వైపు దూసుకెళుతుందా అన్నది క్లోజింగ్ సమయంలో చూడొచ్చు.