For Money

Business News

లిస్టింగ్‌ రోజే 10% డౌన్‌

మరో ఐపీఓ ఇన్వెస్టర్లను ముంచింది. ఇటీవల వరుసగా ఐపీఓలు విఫలమౌతున్నాయి. కంపెనీ లెక్కలు నమ్మి ఇన్వెస్ట్‌ చేసినవారందరూ నష్టాల బారీ పడుతున్నారు. తాజా ఎథోస్‌ లిమిటెడ్‌ షేర్‌ ఇవాళ ఆరు శాతం నష్టంతో లిస్టయింది. ఆ తరవాత కూడా అమ్మకాల ఒత్తిడి రావడంతో పది శాతంపైగా నష్టపోయింది. ఎథోస్‌ లిమిటెడ్‌ ఒక్కో షేర్‌ను రూ. 878లకు ఆఫర్‌ చేసింది. ఇవాళ ఓపెనింగ్‌లో ఆరు శాతం నష్టంతో రూ. 825 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్టయింది. కాని తరవాత అమ్మకాల ఒత్తిడి రావడంతో పది శాతంపైగా నష్టపోయి రూ. 773లకు పడిపోయింది. లగ్జరీ, ప్రీమియం వాచ్‌ రీటైల్‌ కంపెనీ అయిన ఎథోస్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అతి కష్టం మీద పూర్తయింది. ఆఫర్‌ ద్వారా రూ. 375 కోట్లు సమీకరించింది.