For Money

Business News

NIFTY LEVELS: వెంటనే ఒత్తిడి

మార్కెట్ ఇపుడు కన్సాలిడేట్‌ అవ్వొచ్చు. భారీగా క్షీణించకపోయినా… వెంటనే భారీ లాభాలు అనుమానమే. ఈ నెలలో చివరి వీక్లీ, నెలవారీ డెరివేటిక్స్‌లో మార్పు చేర్పులు అధికంగా ఉండొచ్చు. మార్కెట్‌ తరవాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు ఉంటాయి. ఇక ఇవాళ్టి నిఫ్టి లెవల్స్‌ చూ్తే.. నిఫ్టికి 16670 ప్రాంతంలో ప్రతిఘటనకు ఛాన్స్‌ ఉంది. పొజిషన్ష్‌ ఉన్నవారు ఇవాళ తొలి లేదా రెండో ప్రతిఘటన స్థాయిలో బయటపడొచ్చు. నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉంది. దిగువకు స్థాయిలో కొనుగోళ్ళకు టెక్నికల్స్‌ సిఫారసు చేస్తున్నాయి.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 16701
రెండో నిరోధం – 16677
తొలి నిరోధం – 16661
నిఫ్టికి కీలకం – 16572
తొలి మద్దతు – 16549
రెండో మద్దతు – 16534
డౌన్‌ బ్రేకౌట్‌ – 16510