పడినా… పెరుగుట కోసమే…
ప్రతిరోజూ స్టాక్ మార్కెట్లో ఇదే తంతుగా మారింది. అధిక స్థాయిలో అమ్మడం, దిగువ స్థాయిలో కొనడం. మొత్తానికి డే ట్రేడర్స్ మార్కెట్‌గా మారిపోయింది. ఆల్గోట్రేడింగ్ రాజ్యమేలుతోంది. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్ నుంచి క్రమంగా బలపడుతూ 18175 పాయింట్ల గరిష్ఠ స్థాయికి పడింది. మిడ్ సెషన్లో మళ్ళీ కోలుకుని ఇపుడు 103 పాయింట్ల లాభంతో 18115 వద్ద ట్రేడవుతోంది. రేపు రాత్రికి ఫెడ్ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో యూరో మార్కెట్లు కూడా ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం చైనా మార్కెట్లు దుమ్ము రేపాయి. దాదాపు అన్ని సూచీలు మూడు శాతం దాకా పెరగ్గా, హాంగ్‌సెంగ్ 5 శాతం లాభంతో ముగిసింది. యూరో మార్కెట్లు కూడా ఒకటి నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇవాళ అదానీ ఎంటర్‌ప్రైజస్ 6 శాతం లాభపడగా, దీవీస్ ల్యాబ్ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిన్న నష్టాల్లో ఉన్న ఎన్టీపీసీ ఇవాళ 4.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. నైకా 5 శాతం లాభంతో స్థిరంగా ఉంది.