దిగువస్థాయిలో మద్దతు
టీసీఎస్, భారతీ ఎయిర్,రిలయన్స్ కారణంగా నిఫ్టి నష్టాల్లో ఉంది. లేకుంటే గ్రీన్‌లో ఉండేది. ఉదయం16136 వద్ద ప్రారంభమైన నిఫ్టి 16174ని తాకినా వెంటనే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆరంభంలోనే 16115 పాయింట్లను తాకింది. దిగువస్థాయిలోమద్దతు అందడంతో నిఫ్టి ఇపుడు 16173 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితాల్లో చమక్కులు లేకపోవడంతో టీసీఎస్ అయిదు శాతం దాకా నష్టపోయింది. అలాగే భారతీ ఎయిర్టెల్ కూడా నాలుగు శాతంపైగా నష్టాల్లో ఉంది. స్వల్పంగానైనా రిలయన్స్ కూడా నష్టాల్లో ఉండటంతో నిఫ్టి రెడ్‌లో ఉంది. ఇక నిఫ్టి గెయినర్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్‌లో ఉంది. క్రూడ్ ధరలు గత వారాంతంలో భారీగా పెరగడంతో ఓఎన్జీసీ కూడా రెండు శాతం పైగా లాభపడింది. నిఫ్టి 30 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీల్లో నిఫ్టి బ్యాంక్ అరశాతంపైగా లాభంతో ఉంది. అలాగే నిఫ్టి నెక్ట్స్ 0.74 శాతం లాభపడింది. చిత్రంగా నిఫ్టి మిడ్ క్యాప్ నష్టాల్లో ఉంది. కాకపోతే నష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ను అనుసరించి యూరో నష్టాల్లో ప్రారంభమైతే.. మిడ్ సెషన్లో మన మార్కెట్లో ఒత్తిడి రావొచ్చు.