For Money

Business News

25000పైన నిలబడలేదు

మార్కెట్‌ ఇవాళ కూడా 25000 స్థాయిని దాటేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైనా… మిడ్ సెషన్‌కు ముందు లాభాల్లో వచ్చి 25062 స్థాయిని తాకింది. అక్కడి నుంచి మళ్ళీ పతనం మొదలైంది. ఒకదశలో 24704 పాయింట్లకు క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని 24826 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 175 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టిలో జియో ఫైనాన్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ట్రెంట్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా నిలిచాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ టాప్‌లో నిలిచింది. తరువాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌ నిలిచాయి. నిఫ్టిలో 2955 షేర్లు ఇవాళ ట్రేడవగా, ఇందులో 1462 షేర్లు నష్టాల్లో, 1412 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ 101 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌లో ముగియడం విశేషం.