For Money

Business News

15,800పైన నిఫ్టికి ఒత్తిడి

ఊహించినట్లే నిఫ్టి 15,800 ప్రాంతంలో ప్రారంభమైంది. అలాగే ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది. సెషన్‌ కొనసాగే కొద్దీ టెంపో నిలబడుతుందా లేదా నిఫ్టి క్షీణిస్తుందా అన్నది చూడాలి. నిఫ్టి ప్రస్తుతం 37 పాయింట్ల లాభంతో 15,785 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్‌ నుంచి రెడ్‌లోకి వచ్చేసింది. మిడ్‌క్యాప్‌ షేర్లు కూడా డల్‌గా ఉన్నాయి. 35 షేర్లు లాభాల్లో ఉన్నా… నిఫ్టి నామ మాత్రపు లాభాలకే పరిమితమైంది. అంటే షేర్లు గ్రీన్‌లో ఉన్నా… దాదాపు క్రితం స్థాయిల వద్దే ఉన్నాయన్నమాట. ఈ వీక్‌ మార్కెట్‌లో నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడమే బెటర్‌.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
మారుతీ 7,621.40 1.79
టైటాన్‌ 1,754.55 1.33
JSW స్టీల్‌ 694.25 1.22
టాటా కన్జూమర్‌ 766.60 1.13
ఇన్ఫోసిస్‌ 1,580.00 1.08

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
పవర్‌గ్రిడ్‌ 233.40 -1.10
ఎన్‌టీపీసీ 116.55 -0.89
ఐసీఐసీఐ బ్యాంక్‌ 635.70 -0.69
శ్రీ సిమెంట్‌ 27,991.10 -0.51
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,013.50 -0.46