నిఫ్టి: ఓపెనింగ్‌లోనే ప్రతిఘటన
ఓపెనైన వెంటనే నిఫ్టికి తొలి ప్రతిఘటన ఎదురైంది. టెక్నికల్ అనలిస్టులు పేర్కొన్న 17560 ప్రాంతంలోనే తొలి ప్రతిఘటన ఎదురైంది. నిఫ్టి 17,561ని తాకిన తరవాత నష్టాల్లోకి జారుకుంది. 17,485ని తాకిన తరవాత కోలుకుని ఇపుడు 17,538 వద్ద ట్రేడవుతోంది.క్రిత ముగింపుతో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి మళ్ళీ 17,560ని దాటితే 17600 ప్రాంతంలో మరోసారి గట్టి ప్రతిఘటన రావొచ్చు. నిఫ్టిలో 36 షేర్లు గ్రీన్‌లో ఉన్నా.. చాలా వరకు నామమాత్రపు లాభాలే. క్రూడ్ ధరలు మళ్ళీ పెరగడంతో ఓఎన్జీసీ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది.నిఫ్టి కన్నా బ్యాంక్ నిఫ్టి, మిడ్ క్యాప్ నిఫ్టి సూచీలు అధిక లాభాల్లో ఉన్నాయి. మరోవైపు టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.