నిఫ్టిని దెబ్బతీసిన నిఫ్టి బ్యాంక్
గ్రీన్‌లో ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్ 0.8 శాతంపైగా నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా క్షీణించాయి. కేవలం పది రోజుల్లోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 1,550 నుంచి రూ.1,405లకు క్షీణించింది. ఇక నిఫ్టి కొన్ని షేర్లు లాభాల్లో ఉన్నా… మార్కెట్‌లో పెద్దగా ఉత్సాహం లేదు. పీవీఆర్, ఇనాక్స్ షేర్ల్ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పీవీఆర్ షేర్ రూ. 2003ని తాకిన తరవాత ఇపుడు రూ.1927 వద్ద ట్రేడవుతోంది.