For Money

Business News

15700 దిగువన నిఫ్టి

మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైంది. సింగపూర్ నిఫ్టి మాదిరిగానే భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15700 దిగువకు పడింది. 15687ని తాకిన తరవాత ఇపుడు 15696 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 500 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. అత్యధికంగా 1.32 శాతం నష్టంతో నిఫ్టి మిడ్‌క్యాప్‌ ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 47 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. క్రూడ ధరల పెరుగుదల కారణంగా ఓఎన్‌జీసీ ఇవాళ కూడా టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బ్యాంకు, ఫైనాన్షియల్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. గత రెండు రోజులుగా భారీ నష్టాల్లో ఉన్న జొమాటొ ఇవాళ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. జూబ్లియంట్‌ ఫుడ్‌ మూడున్నర శాతం నష్టంతో టాప్‌ లూజర్‌గా నిలిచింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో కేవలం హెచ్‌పీసీఎల్‌ మాత్రమే లాభాల్లో ఉంది. నిఫ్టి బ్యాంక్‌లో అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఏయూ బ్యాంక్‌ 5.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది.