For Money

Business News

సగం లాభాలు పాయే

మార్కెట్‌ ఓపెనింగ్‌లోనే 125 పాయింట్లు నష్టపోయింది. ఆరంభంలోనే 15,512 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 118 పాయింట్ల నష్టంతో 15520 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 368 పాయింట్ల నష్టంతో ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలతో మన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. క్రూడ్‌ భారీగా క్షీణించిన నేపథ్యంలో ఏషియన్‌ పెయింట్ స్వల్పంగా లాభపడింది. వాస్తవానికి ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో కేవలం నాలుగు షేర్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అర శాతం లాభంతో. మరోవైపు నిఫ్టిలో46 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న భారీగా పెరిగిన కమాడిటీస్‌, ఐటీ షేర్లు ఇవాళ నిన్నటి లాభాల్లో సగం కోల్పోయాయి. ఇతర సూచీల పరిస్థితి ఇలానే ఉంది. దాదాపు ఒకశాతం పైగా నష్టంతో ఇతర సూచీలు ట్రేడవుతున్నాయి. హిందాల్కో, వేదాంత మూడు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఫుట్స్‌ రైటింగ్స్‌ విభాగంలో స్పష్టమైన ట్రెండ్‌ లేదు. పుట్స్‌ రైటింగ్స్‌ ఎక్కడ ఎక్కువగా ఉంటాయే దాన్ని సపోర్ట్‌ జోన్‌గా పరిగణించవచ్చు. కాని ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు లేవు.