For Money

Business News

100 పాయింట్ల నష్టంతో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి సూచించిన నష్టాలకన్నా అధిక నష్టంతో నిఫ్టి ఓపెనైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16246 పాయింట్లను తాకింది. ఇపుడు 105 పాయింట్ల నష్టంతో 16250 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో ఉంది. అధిక క్రూడ్‌ ఆయిల్‌ ధరల కారణంగా ఎంఆర్‌పీఎల్‌ ఇవాళ కూడా 5 శాతం లాభపడింది. కేవలం వారంలోఈ షేర్‌ 45 శాతం పెరిగింది. ఓఎన్జీసీ ఇవాళ టాప్‌ గెయినర్‌. రిలయన్స్‌ కూడా లాభాల్లో ఉంది. ఇక ఇదే ఆయిల్‌ ధరలు కారణంగా ఏషియన్‌ పెయింట్స్‌ ఇవాళ టాప్‌ లూజర్‌గా నిలిచింది. రెండు శాతం నష్టంతో ఈ షేర్‌ రూ. 2,640 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ రూ. 2500ను తాకుతుందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇతర సూచీలతో పోలిస్తే నిఫ్టి బ్యాంక్‌ ఒక్కటే కేవలం అర శాతం లాభంతో ఉంది. మిగిలిన ప్రధాన సూచీలు దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. ఇక నిఫ్టిలో 45 షేర్లు నష్టాల్లో ఉండగా కేవలం 5 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి.